Hyderabad, ఆగస్టు 28 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా చెప్పచ్చు. రాడిక్స్ నెంబర్ ద్వారా మీ గురించి తెలుసుకోవచ్చు. పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ నెంబర్ తెలుస్తుంది.

కొన్ని రాడిక్స్ నెంబర్స్ వారు జీవితంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. కొంత మందికి సులువుగా సంతోషం, డబ్బు ఉంటాయి. ఇలాంటి వారిని "వెండి స్పూన్‌తో పుట్టారు" అని చెప్పవచ్చు. మరి అలాంటి వారి గురించి ఈరోజు తెలుసుకుందాం. వారిలో మీరు కూడా ఉన్నారేమో చెక్ చేసుకోండి.

న్యూమరాలజీ ప్రకారం రాడిక్స్ నెంబర్ 6 వారు చాలా అదృష్టవంతులు. 6 సంఖ్యకు అధిపతి శుక్రుడు. శుక్రుడు విలాసాలు, ప్రేమ మొదలైన వాటికి కారకుడు. శుక్రుడి అనుగ్రహంతో ఈ రాశివారు ఎల్లప్పుడూ డబ్బుతో సంతోషంగా ఉంటారు. విలాసవంతమైన...