Hyderabad, జూలై 15 -- న్యూమరాలజీ ఆధారంగా ఎన్నో విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటు, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు. ఈరోజు రాడిక్స్ నెంబర్ 6 కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. న్యూమరాలజీ ప్రకారం రాడిక్స్ నెంబర్ 6 కి అధిపతి శుక్రుడు. శుక్రుడు ప్రేమ, సంతోషం, విలాసాలకు కారకుడు.

ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 6 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి శుక్రుడు. ప్రేమ, ధనం, సంతోషం, విలాసాలను అందిస్తాడు. ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు రావు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. సంతోషంగా ఉంటారు.

రాడిక్స్ నెంబర్ 6 వారు ఆనందంతో ఉంటారు. ఈ వ్యక్తులు వర్తమానంలోనే ఉంటారు. ప్రతి క్షణాన్ని ఉత్సాహంగా జీవిస్తా...