భారతదేశం, డిసెంబర్ 22 -- తెలంగాణ పర్యాటక శాఖ 2026 జనవరిలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ కైట్, బెలూన్, డ్రోన్ ఫెస్టివల్‌తో సహా అనేక ప్రధాన పర్యాటక కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ మేరకు ఏర్పాట్లుపై దృష్టి పెట్టింది. ఇంటర్నేషనల్ కైట్ మరియు స్వీట్ ఫెస్టివల్ 2026 జనవరి 13 నుండి 15 వరకు జరుగుతుంది. హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ 2026 జనవరి 16 నుండి 18 వరకు జరగనుంది. అంతేకాకుండా జనవరి 13 మరియు 14 తేదీల్లోనే డ్రోన్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు.

తెలంగాణ పర్యాటక ప్రదేశాలను ప్రదర్శించడం, దేశీయ, అంతర్జాతీయ సందర్శకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించడం ఈ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ లక్ష్యం అని పర్యాటక అధికారులు తెలిపారు. కైట్స్ ఎగరవేయడం, ప్రాంతీయ స్వీట్లు వంటి సాంప్రదాయ ఆకర్షణలతో పాటు, విభిన్న సాంస్కృతిక, వినోద అనుభవాన్ని అందించడానికి హాట్ ఎయిర్ బెలూ...