Hyderabad, జూన్ 21 -- ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు కష్టం వస్తూనే ఉంటుంది. రాశుల ఆధారంగా మనం ఎలా అయితే భవిష్యత్తును తెలుసుకుంటాము, న్యూమరాలజీ ఆధారంగా కూడా భవిష్యత్తును తెలుసుకోవచ్చు. దానితో పాటు ఒక మనిషి పేరు, ప్రవర్తన ఎలా ఉంటాయనేది న్యూమరాలజీ ద్వారా చెప్పవచ్చు.

ఈరోజు కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన వారి గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. మనం పుట్టిన తేదీ వెనుక చాలా రహస్యాలు ఉంటాయి. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా స్పెషల్ అని చెప్పవచ్చు.

న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ నంబర్స్ ఉంటాయి. వీటికి ఏదైనా గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. ఆ గ్రహం వలన మనిషిపై ప్రభావం పడుతుంది. వారి జీవితంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ప్రవర్తన కూడా గ్రహాల ఆధారంగా ఉ...