Hyderabad, ఏప్రిల్ 7 -- న్యూమరాలజీలో వ్యక్తిత్వం, అంచనాలు, ప్రవర్తన వంటివన్నీ కూడా రాడిక్స్ నెంబర్ ఆధారంగా అంచనా వేస్తారు. దీన్నే మూల సంఖ్య అని పిలుస్తారు. వ్యక్తి పుట్టిన తేదీని బట్టి మూల సంఖ్య ఆధారపడి ఉంటుంది. ఈరోజు మనం పిసినారితనంగా ఉండి, ఎదుటివారి చేత ఖర్చు పెట్టే వారి గురించి తెలుసుకుందాం.

ఇలాంటి వారితో స్నేహం చేయడం కూడా ప్రమాదమే. ప్రతి అవసరానికి పక్కనున్న స్నేహితుల చేతే ఖర్చు పెట్టిస్తారు. తమ జేబులోంచి రూపాయి కూడా తీయరు. ఇలాంటివారు పక్కన ఉంటే ఖర్చులు పెరిగిపోతాయి.

ఏదైనా నెలలో 5, 14, 23 ఈ తేదీలలో పుట్టిన వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి మూల సంఖ్య 5. అంటే వారి పుట్టిన తేదీలోని అంకెలను కలిపితే చివరికి వచ్చేది ఐదు సంఖ్య. ఈ సంఖ్యకు అధిపతి బుధ గ్రహం. బుధుడు తెలివితేటలకు, చాతుర్యానికి, మాటలకు, వ్యాపారాలకు, గణిత శాస్త్రానికి కారకుడు. అ...