భారతదేశం, నవంబర్ 17 -- ఏపీలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పడనున్నాయి. ఈ మేరకు తేదీ ఖరారైంది. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం రెండో విడత డబ్బులు రైతుల ఖాతాల్లో పడనున్నట్టుగా మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ నెల 19వ తేదీన అన్నదాత సుఖీభవం పథకం అమలుకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనుంది. అదే రోజు పీఎం కిసాన్ నిధులు కూడా పడనున్నాయి.

అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం రెండో విడత అమలుపై వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు తాజాగా సమీక్ష నిర్వహించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. 'ఈనెల 19వ తేదీన వైఎస్సాఆర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు రైతుల ఖాతాల్లో నిధులు జమచేయనున్నారు. అర్హులైన రైతులు చనిపోతే వారి వారసులకు డెత్ మ్యూటేష్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటాం. ఎన్‌పీసీఏలో ఇన్ యాక్టివ్‌గా ఉన్న ఖాత...