భారతదేశం, డిసెంబర్ 8 -- సీనియర్ నటులు సుమన్, నాజర్, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించిన లేటెస్ట్ తెలుగు సినిమా ఫెయిల్యూర్ బాయ్స్. క్రాంతి, అవి తేజ్, ప్రదీప్, సుపర్ణ, పవని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వెంకట్ త్రినాథ రెడ్డి ఉసిరిక దర్శకత్వం వహించారు.

శ్రీ గురు దక్షిణ మూర్తి ఫిలింస్ పతాకంపై వీఎస్ఎస్ కుమార్, ధన శ్రీనివాస్ జామి, లక్ష్మి వెంకట్ రెడ్డి ఫెయిల్యూర్ బాయ్స్ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఫెయిల్యూర్ బాయ్స్ సినిమా డిసెంబర్ 12న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన ఫెయిల్యూర్ బాయ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ వీఎస్ఎస్ కుమార్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

నిర్మాత వీఎస్ఎస్ కుమార్ మాట్లాడుతూ.. "ఫెయిల్యూర్ బాయ్స్ అంటే ఎవరు ఉండరు. జీవితంలో ఒకసారి ఫెయిల్ అయితేనే జీవితంలో ఎలా పైకి రావాలో తెలుస్తుంది. అం...