భారతదేశం, ఏప్రిల్ 20 -- మీరు ట్రయంఫ్ నుండి కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తుంటే.. ఇది మీకు మంచి అవకాశం. ఎందుకంటే ట్రయంఫ్ తన పాపులర్ బైక్స్ స్పీడ్ 400, స్పీడ్ టీ 4, స్క్రాంబ్లర్ 400 ఎక్స్‌లపై గొప్ప ఆన్‌లైన్ ఆఫర్లను ప్రకటించింది. అయితే బైక్ వాలే వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే మాత్రమే ఈ ఆఫర్లు చెల్లుబాటు అవుతాయని గుర్తుంచుకోండి.

ఈ ఆఫర్‌లో లభించే ప్రయోజనాల గురించి చూస్తే.. స్పీడ్ 400, స్పీడ్ టీ 4 కొనుగోలు చేస్తే మీకు 3,000 అమెజాన్ గిఫ్ట్ వోచర్ లభిస్తుంది. అదే సమయంలో ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్ కొనుగోలు చేస్తే అమెజాన్ గిఫ్ట్ వోచర్ 2,000 లభిస్తుంది. బైక్ డెలివరీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఈ గిఫ్ట్ వోచర్ మీకు వాట్సాప్ లేదా ఇమెయిల్ ద్వారా పంపిస్తారు.

భారతదేశంలో ట్రయంఫ్ నుండి చౌకైన బైక్. తేలికపాటి బరువు, మంచి పనితీరు దీని ప్రత్యేకత. 399 సీస...