భారతదేశం, జూన్ 10 -- కర్వ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, టియాగో ఈవీ ఎలక్ట్రిక్ వాహన శ్రేణిపై టాటా మోటార్స్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్లలో గ్రీన్ బోనస్లు, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా 2024 సంవత్సరానికి చెందిన ఇన్వెంటరీని క్లియర్ చేయడమే లక్ష్యంగా ఈ ఆఫర్లను టాటా మోటార్స్ ప్రకటించింది.

టియాగో ఈవీ, పంచ్ ఈవీకి సంబంధించి 2025 సంవత్సరంలో ఉత్పత్తి అయిన యూనిట్లను కూడా ఎంచుకోవచ్చు. వాటికి కూడా పరిమిత-సమయ ప్రయోజనాలు లభిస్తాయి. అయితే, జూన్ 2025లో చేసిన కొనుగోళ్లకు మాత్రమే ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయని గుర్తుంచుకోండి

టాటా మోటార్స్ కర్వ్ ఈవీ 2024 సంవత్సర యూనిట్లపై రూ.70,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో గ్రీన్ బోనస్ కింద రూ.50,000, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ఇన్సెంటివ్ కింద రూ.20,000 వరకు లభిస్తుంది. కర్వ్ ఈవీ ధర రూ...