భారతదేశం, ఫిబ్రవరి 10 -- కొన్ని రోజులుగా పులులు జనావాసాల్లోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నలుమూలలా పులుల కొంతకాలంగా పులుల గాండ్రింపులువినిపిస్తున్నాయి. మెున్నటికి మెున్న తడోబా నుంచి వచ్చిన పులి ఆంధ్రాలో హల్‌చల్ చేసింది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో పులుల సంచారం భయం పుట్టిస్తోంది. తాజాగా ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో జనాలకు కునుకు లేకుండా చేస్తోంది పులి.

సిద్దిపేట జిల్లా కోహెడ సమీపంలోని సింగరాయగుట్ట సమీపంలో పులిని నైట్ విజన్ కెమెరా ట్రాప్‌లు గుర్తించాయి. దీనితో సమీప ప్రాంతాలలో హెచ్చరిక జారీ చేశారు అధికారులు. అటవీ శాఖ సిబ్బంది పర్యవేక్షణను ముమ్మరం చేసింది. పులిని సురక్షితంగా పట్టుకోవడానికి ఉచ్చును ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ అధ్యక్షత ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం పులి సంచా...