Telangana,hyderabad, జూన్ 28 -- హైదరాబాద్ లోని మాధాపూర్ సున్నం చెరువులోని నీటి వాడకంపై హైడ్రా హెచ్చరికలను జారీ చేసింది. కొందరు వ్యాపారులు. చెరువు చెంత బోర్లు వేసి. ప్రజల ఆరోగ్యానికి కన్నం పెడుతున్నారని తేల్చింది. కలుషిత జలాలతో మాధాపూర్ పరిసరాల్లో ఉన్న హాస్టల్స్ విద్యార్థుల భవిష్యత్ ను అనారోగ్యం పాలు చేస్తున్నట్లు గుర్తించింది.

ఈ చెరువును పునరుద్ధరించే క్రమంలో హైడ్రా అధికారులు.. ఇక్కడి భూగర్భ జలాలు ఎంతటి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయో అనే అంశాన్ని పీసీబీ (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) ద్వారా పరీక్షించింది. తాగునీటిగా సరఫరా చేస్తున్న ట్యాంకర్లలోని నీటి నమూనాలపై అధ్యయనం చేయించింది.

సీసం, కాడ్మియం, నికెల్ లోహాల మోతాదులు అధికంగా ఉన్నాయని ఈ పరిశోధనల్లో వెల్లడైంది. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పీసీబీ హెచ్చరించింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం...