Hyderabad, మే 12 -- కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోవడం వల్ల గుండె జబ్బులు, రక్తపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. కాబట్టి శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైన కొవ్వు పదార్థం.

కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోయి రక్త ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. అయితే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి వెల్లుల్లి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో వెల్లుల్లి చట్నీ తయారు చేసుకోండి. దీని తరచూ తినడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ చాలా వరకు కరిగిపోతుంది.

వెల్లుల్లి రెబ్బలు - పది

జీలకర్ర - ఒక స్పూను

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

నిమ్మరసం - ఒక స్పూను

పచ్చిమిర్చి - మూడు

1. వెల్లుల...