భారతదేశం, డిసెంబర్ 1 -- గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల పండుగ మెుదలైంది. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో ఉన్న సమస్యలను జనాలు ముందుకు తీసుకువస్తున్నారు. పరిష్కారం చూపినవారికే ఓటు వేస్తాం లేదంటే ఏకగ్రీవం చేస్తామంటూ చెబుతున్నారు. వరంగల్ జిల్లాలో ఓ గ్రామం కోతుల సమస్యను తీర్చినవారికే తమ ఓటు అంటూ తీర్మానం చేసుకుంది.

వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామస్థులు కోతుల బెడదను అదుపు చేస్తామని హామీ ఇచ్చే అభ్యర్థిని సర్పంచ్‌గా ఎన్నుకుంటామని ఏకగ్రీవంగా ప్రకటించారు. 5,400 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో 20,000 కంటే ఎక్కువ కోతులు ఉన్నాయి. ఇది ఇక్కడ జనాభా కంటే నాలుగు రెట్లు ఎక్కువ. కోతులతో రోజువారీ జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జనాలు. కోతులు ప్రజలపై దాడి చేసి గాయపరుస్తున్నాయి కూడా. వంట పాత్రలను దొంగి...