భారతదేశం, ఏప్రిల్ 22 -- ఇండియాలో 7 సీటర్​ వాహనాలకు ఇటీవలి కాలంలో డిమాండ్​ పెరుగుతోంది. ఇక ఇప్పుడు జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్​ నుంచి ఒక కొత్త 7 సీటర్​ ఎస్​యూవీ, మార్కెట్​లో చేరనుంది. దాని పేరు ఎంజీ మెజెస్టర్​. ఈ ఎస్​యూవీని తొలిసారిగా 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్​పోలో ప్రదర్శించగా.. ఇప్పుడు ఈ మోడల్​కి సంబంధించిన టెస్ట్​ డ్రైవ్​ ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఈ నేపథ్యంలో త్వరలో ఇండియాలో లాంచ్​ అవుతున్న ఈ మోడల్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

కొన్ని గ్లోబల్ మార్కెట్లలో అమ్మకానికి ఉన్న మాక్సస్ డీ 90 ఎస్​యూవీ ఆధారంగా ఎంజీ మెజెస్టర్ తయారైంది. దీని ముందు భాగంలో భారీ ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది. దీనికి గ్లాస్​ బ్లాక్​ ఫినిషింగ్​ వస్తుంది. స్ల్పిట్​-హెడ్ ల్యాంప్ డిజైన్ ఉంది. ఇక్కడ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ పైన పెట్టడం ...