భారతదేశం, డిసెంబర్ 3 -- గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్ట్ చేసిన లేటెస్ట్ డివోషనల్ యాక్షన్ మూవీ అఖండ 2 తాండవం. సూపర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్‌గా అఖండ 2 చిత్రాన్ని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించారు. ఆది పినిశెట్టి విలన్‌గా బ్యూటిఫుల్ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా, పూర్ణ కీలక పాత్రలు పోషించారు.

రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అఖండ 2 సినిమాకు ఎస్ తమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. అలాగే, బాలకృష్ణ కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పించిన ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌గా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ చేశారు.

డిసెంబర్ 5న అఖండ 2 థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రామ్ లక్ష్మణ్ మా...