Hyderabad, అక్టోబర్ 5 -- టాలీవుడ్‌లో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు రక్షిత్ అట్లూరి. పలాస 1978 మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో రక్షిత్ అట్లూరి లండన్ బాబులు, నరకాసుర, ఆపరేషన్ రావణ్ వంటి సినిమాలతో అలరించాడు. ఇప్పుడు రక్షిత్ అట్లూరి నటించిన లేటెస్ట్ మూవీ శశివదనే.

ఇప్పటివరకు యాక్షన్ థ్రిల్లర్స్ చేసిన రక్షిత్ అట్లూరి రొమాంటిక్ లవ్ స్టోరీగా శశివదనే సినిమాను చేశాడు. ఈ సినిమాలో రక్షిత్ అట్లూరికి జోడీగా బ్యూటిపుల్ కోమలి ప్రసాద్ హీరోయిన్‌గా చేసింది. శశివదనే సినిమాకు సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు.

గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల శశివదనే సినిమాను నిర్మించారు. అక్టోబర్ 10న శశివదనే సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 4న శశివదనే చిత్ర బృందం ...