Hyderabad, ఆగస్టు 4 -- ఓటీటీలో సరికొత్త తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ మయసభ: రైజ్ ఆఫ్ ది టైటాన్స్ స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ డైరెక్టర్ దేవ కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వం వహించిన మయసభ ఓటీటీ సిరీస్‌లో హీరోలు ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రలు పోషించారు.

ఇటీవల మయసభ ట్రైలర్ రిలీజ్ చేస్తూ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హీరో సాయి దుర్గ తేజ్ హాజరు కాగా డైరెక్టర్ దేవ కట్టా, హీరో ఆది పినిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

దర్శకుడు దేవ కట్టా మాట్లాడుతూ.. "ఆది నటన అంటే నాకు చాలా ఇష్టం. హీరో, విలన్, ఏ పాత్ర అయినా కూడా అద్భుతంగా నటించేస్తారు. ఈ కథ అనుకున్న వెంటనే నాకు ఆది గుర్తుకు వచ్చారు. ఆదిని మ్యాచ్ చేసేందుకు చైతన్య కష్టపడ్డారు. ఈ ఓటీటీ సిరీస్ కోసం 264 మందిని తీసుకున్నాం. దివ్య దత్తా గారు అద్భుతంగా ...