భారతదేశం, జనవరి 14 -- సంక్రాంతి 2026కు బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతున్న తెలుగు సినిమాల్లో భర్త మహాశయులకు విజ్ఞప్తి ఒకటి. ఎలాగైనా హిట్ కొట్టాలనే లక్ష్యంతో రూట్ మార్చి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వచ్చేశాడు మాస్ మహారాజ్. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. జనవరి 13న రిలీజైన ఈ చిత్రం ఏ ఓటీటీలోకి వస్తుందో ఇక్కడ చూసేయండి.

రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. నిన్న (జనవరి 13) న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. ఇందులో డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లు. ఈ చిత్రానికి కిశోర్ తిరుమల డైరెక్టర్. ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ స్ట్రీమింగ్ రైట్స్ ను జీ నెట్ వర్క్ సొంతం చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ జీ5 ఓటీటీలోకి వస్తుంది.

భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఓటీటీలోనేమో జీ5లో, టీవీలోనే జీ తెలుగు ఛానెల్ లో స్...