Hyderabad, ఆగస్టు 12 -- రాశుల ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు. మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటుగా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేదిని కూడా చెప్పవచ్చు. అదే విధంగా ఒక్కో రాశి వారి మనస్తత్వం ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని రాశుల వారు మానసికంగా దృఢంగా ఉంటారు.

ఎటువంటి పరిస్థితులైనా తట్టుకుంటారు. మానసిక ఆరోగ్యం విషయంలో ఏ ఇబ్బందులు రావు. ఏ సమస్యనైనా సులువుగా డీల్ చేసుకోగలరు. టెన్షన్ పడిపోవడం వంటి విషయాలు వారికి తెలియదు. మరి మానసికంగా దృఢంగా ఉండే రాశులు ఎవరు? ఏ రాశుల వారు మానసిక ఇబ్బందులకు దూరంగా ఉంటారు?

మేష రాశి అధిపతి కుజుడు. మేష రాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు. ఎలాంటి కష్టమైన పరిస్థితి వచ్చినప్పటికీ దానిని ధైర్యంగా ఎదుర్కోగలరు. ఛాలెంజ్‌లను తీసుకోవడం వీరికి చాలా ఇష్టం. ఛాలెంజ్‌ను స్వీకరించి, వాటిని సమర్థవంతంగా పూర్తి చేయాలని, ...