Hyderabad, జూలై 3 -- మొత్తం మనకి 12 రాశులు. రాశుల ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి ప్రవర్తన, తీరు ఎలా ఉంటుందని చెప్పడమే కాకుండా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు.

కొన్ని రాశుల వారు బాగా మొండి వారు, కొన్ని రాశుల వారు ఎంతో కూల్‌గా ఉంటారు. ఇతరులు చెప్పేది వింటారు. కొన్ని రాశుల వారు మాత్రం వారు ఒకసారి ఫిక్స్ అయితే వారి మాటను కూడా వారు వినరు. నిజానికి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మొండితనం ఉంటుంది. "నేను ఎందుకు వారి మాట వినాలి" అని అనుకుంటూ ఉంటారు. అందరిలో మొండితనం ఉన్నా, కొంతమందిలో మాత్రం ఎక్కువగా ఉంటుంది.

ఒకసారి వారు ఏదైనా ఫిక్స్ అయినట్లయితే దానిని పూర్తి చేస్తారు తప్ప, ఎవరు చెప్పినా మధ్యలో వినరు. ఈ కారణంగా కొన్నిసార్లు చిక్కుల్లో పడతారు. జ్యోతీష శాస్త్రం ప్రకారం ఏ రాశుల వారు మొండిగా ఉంటారు, ఎవరు ఏం చెప్పి...