Hyderabad, సెప్టెంబర్ 18 -- రాశుల ఆధారంగా అనేక విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తనతో పాటు భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ జీవితాన్ని సంతోషంగా మార్చే వ్యక్తి జీవితంలోకి రావాలని అనుకుంటారు. ప్రేమ అనేది శక్తివంతమైన భావాలలో ఒకటి. మనం ప్రేమిస్తున్న వ్యక్తి నిజాయితీతో ఉంటే ఆ ప్రేమ కూడా చాలా బాగుంటుంది.

కొంత మంది నిజంగా ప్రేమించరు, కానీ ప్రేమిస్తున్నట్లు నటిస్తూ ఉంటారు. అయితే కొన్ని రాశుల వారు మాత్రం నిజాయితీగా ప్రేమిస్తారు. వీరు పక్కన ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు వీరిపై నమ్మకం ఉంటుంది. పూర్తి ఎఫర్ట్ పెట్టి ప్రేమిస్తారు. మరి ఆ రాశుల వారు ఎవరు? ఆ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి వారు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. వీరి భావాలను రహస్యంగా ఉంచలేరు. వారు ఏమన...