Hyderabad, ఏప్రిల్ 14 -- ఏప్రిల్ నెలలో మనదేశంలో ఎక్కువ మంది గొంతు ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. నిజానికి ఇవన్నీ కూడా శీతాకాలంలో ఎక్కువగా కనిపించే రోగాలు. అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలోనే ఎక్కువ మందికి ఈ వ్యాధులు సోకినట్టు వైద్యులు చెబుతున్నారు. దీనికి కారణాలు కూడా వివరిస్తున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పగటిపూట తీవ్రమైన వేడి కనిపిస్తోంది. రాత్రిపూట ఆకస్మికంగా చల్లదనం వస్తోంది. కొన్నిచోట్ల వర్షాలు, మేఘాలు కనిపిస్తున్నాయి. ఇలా వాతావరణంలో హఠాత్తుగా జరిగే హెచ్చుతగ్గులు శరీరంలోని ఉష్ణోగ్రత వ్యవస్థను గందరగోళ స్థితికి చేరుస్తున్నాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. వాతావరణం అనుకూలంగా ప్రజలు దుస్తులు ధరించలేకపోతున్నారు. దీని వల్ల కూడా వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్టు ఫిజీషియన్లు వివరిస్తున్నారు.

శీతాకాలం ...