భారతదేశం, డిసెంబర్ 31 -- భారతీయ స్టాక్ మార్కెట్లో బ్యాంకింగ్ రంగం సరికొత్త ఉత్సాహంతో పరుగులు తీస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుండి ఇప్పటివరకు (Year-to-Date) నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 16 శాతం లాభపడి మదుపర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. ఇదే సమయంలో ప్రధాన సూచీ నిఫ్టీ 50 కేవలం 10 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేయడం గమనార్హం. అంటే, మార్కెట్ సగటు వృద్ధి కంటే బ్యాంకింగ్ రంగం మెరుగైన ప్రదర్శన కనబరిచింది.

కెనరా బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఎస్‌బీఐ వంటి షేర్లు ఈ ఏడాది ఏకంగా 25 నుండి 50 శాతం వరకు లాభాలను పంచిపెట్టి ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోకు బలాన్నిచ్చాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల బ్యాంకుల మార్జిన్లపై కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఈ పరిస్థితి చక్కబడుతుందని నిపుణులు భావిస్తున్నారు. "వడ్డీ రే...