Hyderabad, ఆగస్టు 13 -- వినాయకుడిని ఆరాధిస్తే ఎలాంటి ఇబ్బందుల నుంచి అయినా బయటపడొచ్చు. మొట్టమొదట ఏ దేవుడిని పూజించాలన్నా, మొట్టమొదట పూజలు అందుకుంటాడు గణపతి. హిందువులు ఘనంగా జరుపుకునే పండుగల్లో వినాయక చవితి కూడా ఒకటి. భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి హడావిడి కూడా మనకి కనబడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటారు. ఈసారి వినాయక చవితి ఎప్పుడు వచ్చింది? వినాయక చవితి తేదీ, శుభసమయంతో పాటుగా మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 27, బుధవారం నాడు వచ్చింది. వినాయక చవితి నాడు ఇళ్లల్లో, వీధుల్లో వినాయకుని మండపాలు పెట్టి, వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. వినాయక చవితి నాడు విజ్ఞానాన్ని తొలగించే వినాయకుడిని పూజించి, పత్రాలతో పూజలు చేస్తారు. కుడుములు, ఉండ్రాళ్ళు, పిండివంటల్ని నైవేద...