Hyderabad, సెప్టెంబర్ 9 -- హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరా కూడా ఒకటి. దసరా పండుగను 11 రోజులు పాటు జరుపుకుంటారు. చెడుపై మంచి గెలిచిందని, విజయానికి ప్రత్యేకతగా దసరా పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం దసరా నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలయ్యాయి? దసరా పండుగ విశిష్టత ఏంటి? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సంవత్సరం నవరాత్రులు సెప్టెంబర్ 22 నుంచి మొదలై అక్టోబర్ 2 వరకు ఉంటాయి. ఈ ఏడాది విజయదశమి అక్టోబర్ 2న వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా దసరా నవరాత్రులను ఘనంగా జరుపుకుంటారు. ప్రతిరోజూ కూడా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను కూడా సమర్పిస్తారు.

దసరా పండుగ రాక్షస సంహారానికి ప్రతీక. చెడుపై మంచే గెలుస్తుందని చెప్పే రోజు ఇది. దసరాకి సంబంధించి చాలా పురాణ గాథలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన...