Hyderabad, మే 13 -- మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది కూడా వెల్లువలా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. సక్సెస్ సాధిస్తున్నవి మాత్రం కొన్నే అని చెప్పాలి. జనవరి నుంచి ఏప్రిల్ వరకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు 10 ఉండగా.. వీటిలో ఐదు ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ మూవీ ఎల్2: ఎంపురాన్ కూడా ఉంది. ఈ సినిమాలన్నీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

గతేడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ వచ్చినా.. చివరికి నష్టాల్లోనే ముగిసింది. ఈ ఏడాది కూడా చాలా వరకు పరిస్థితి అలాగే ఉంది. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఆ ఇండస్ట్రీని ఆదుకున్నాయి. ఆ మూవీస్ ఏవి? వాటిని ఏ ఓటీటీలో చూడాలో తెలుసుకోండి.

మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన ఈ మూవీ అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం సినిమా చరిత్ర సృష్టించింది. ప...