భారతదేశం, డిసెంబర్ 10 -- ఈ ఏడాది ఓటీటీ వెబ్ సిరీస్ ప్రియులకు పండగనే చెప్పాలి. 'ది ఫ్యామిలీ మ్యాన్', 'స్పెషల్ ఆప్స్', 'పంచాయత్' వంటి భారీ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించాయి. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అతిపెద్ద విజయాన్ని అందుకున్నాడు. అతడు డైరెక్ట్ చేసిన తొలి వెబ్ సిరీస్ 'ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్' ఐఎండీబీ జాబితాలో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది.

బుధవారం (డిసెంబర్ 10) నాడు IMDb సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్ల పేజ్ వ్యూస్ ఆధారంగా అత్యంత ప్రజాదరణ పొందిన టాప్-10 ఇండియన్ వెబ్ సిరీస్‌ల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ పదింటిలో ఏడు క్రైమ్ థ్రిల్లర్లే కావడం.. ఆరు సిరీస్‌లు కొత్త సీజన్లతో వచ్చినవి కావడం విశేషం. వీటిలో తొలి స్థానంలో ఆర్యన్ ఖాన్ డైరెక్షన్ లో వచ్చిన బాస్టర్డ్స్ ఆఫ్...