Hyderabad, జూలై 9 -- ఈ ఏడాది అంటే 2025 మొదటి అర్ధభాగం ముగియడంతో, ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (IMDb ఇండియా) ఈ ఏడాదిలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ మూవీస్ లిస్ట్ విడుదల చేసింది. ఈ ఏడాది విడుదలైన అన్ని ఇండియన్ సినిమాలకు యూజర్స్ రేటింగ్‌లు, ఇంట్రెస్ట్స్ ఆధారంగా IMDb అత్యధిక ఆసక్తిని రేకెత్తించిన సినిమాల జాబితాను రూపొందించింది. ఆశ్చర్యకరంగా, అత్యధిక బాక్సాఫీస్ వసూళ్లను సాధించిన మూవీయే అత్యంత పాపులర్ మూవీగానూ నిలిచింది.

ఈ ఏడాది మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీ ఛావా (Chhaava). 2025లో సల్మాన్ ఖాన్ నటించిన 'సికందర్', ఆమిర్ ఖాన్ నటించిన 'సితారే జమీన్ పర్', అక్షయ్ కుమార్ నటించిన 'కేసరి ఛాప్టర్ 2' వంటి చిత్రాలు విడుదలైనప్పటికీ అవేవీ ఛావా ముందు నిలవలేకపోయాయి. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన చారిత్రక డ్రామా 'ఛావా'కి ఈ ఘనత దక్కించుకుంది. విక్కీ కౌశల్ ప్రధాన...