భారతదేశం, జనవరి 13 -- సంక్రాంతి పనులు మొదలైపోయాయి. తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి సంబరాలు కనిపిస్తున్నాయి. ఈ జనవరి 14 అంటే రేపు భోగి పండుగను జరుపుకోబోతున్నాము. అలాగే 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలను జరుపుకోబోతున్నాము. అయితే ఈ సంవత్సరం వచ్చే భోగి పండుగ చాలా విశేషమైనది. భోగి నాడు అరుదైన ఆధ్యాత్మిక సమ్మేళనం చోటు చేసుకోనుంది.

భోగి (Bhogi 2026) అంటే వెలుగుల పండుగకు మొదటి అడుగు. భోగి మంటల్లో దుఃఖాలు అన్నీ కాలిపోయి, సంతోషాలు చిగురించాలని అందరూ కోరుకుంటారు. ఉత్తరాయణంలో కొత్త ఆశలు ఉదయిస్తాయి. 2026 భోగి అనేది కేవలం పండుగ కాదు. పంచాంగం పరంగా చూసినట్లయితే అరుదైన ఏకాదశి యోగం ఆ రోజు రావడం విశేషం.

ఈ భోగికి ఏకాదశి తిథి రావడంతో దీని విశిష్టత మరింత పెరిగింది. భోగి తర్వాత సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. అంటే దేవతల పగలు ప్రారంభమయ్యే శుభక...