భారతదేశం, డిసెంబర్ 16 -- ముంబై వేదికగా సోమవారం అంటే డిసెంబర్ 15న 6వ ఎడిషన్ ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్ (Filmfare OTT Awards 2025) ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో 'పాతాళ్ లోక్ సీజన్ 2', 'బ్లాక్ వారెంట్', 'ఖౌఫ్' వంటి వెబ్ సిరీస్‌లు.. 'గర్ల్స్ విల్ బీ గర్ల్స్', 'సెక్టార్ 36' వంటి సినిమాలు సత్తా చాటాయి. జైదీప్ అహ్లావత్, విక్రాంత్ మాస్సే, అనన్య పాండే వంటి వారు బ్లాక్ లేడీ ట్రోఫీలను అందుకున్నారు.

ఓటీటీ కంటెంట్‌ను ప్రోత్సహించేందుకు నిర్వహించే ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్ వేడుక ముంబైలో అట్టహాసంగా జరిగింది. ఆలియా భట్, విక్కీ కౌశల్ వంటి బాలీవుడ్ తారలు హాజరైన ఈ ఈవెంట్‌లో విజేతల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

ఈ విభాగంలో 'పాతాళ్ లోక్ 2', బ్లాక్ వారెంట్, 'ఖౌఫ్' సిరీస్‌లు ఎక్కువ అవార్డులను కైవసం చేసుకున్నాయి.

ఉత్తమ వెబ్ సిరీస్ (క్రిటిక్స్): పాతాళ్ లోక్ సీజన్ 2...