భారతదేశం, డిసెంబర్ 10 -- ఈ ఏడాది అంటే 2025 సినిమాల పరంగా చాలా రసవత్తరంగా సాగింది. విక్కీ కౌశల్ పీరియడ్ డ్రామా 'ఛావా', రిషబ్ శెట్టి మైథలాజికల్ వండర్ 'కాంతార: ఎ లెజెండ్ - చాప్టర్ 1', అజయ్ దేవగన్ 'రైడ్ 2' వంటి భారీ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. కానీ అనూహ్యంగా ఇద్దరు కొత్త ముఖాలతో వచ్చిన ఒక రొమాంటిక్ మ్యూజికల్ సినిమా వీటన్నింటినీ వెనక్కి నెట్టి ఐఎండీబీ 2025 టాప్ మూవీగా నిలిచింది.

బుధవారం (డిసెంబర్ 10)నాడు ఐఎండీబీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 250 మిలియన్లకు పైగా యూజర్ల పేజ్ వ్యూస్ ఆధారంగా 2025లో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్-10 భారతీయ సినిమాల జాబితాను విడుదల చేసింది.

మోహిత్ సూరి దర్శకత్వంలో.. అనీత్ పడ్డా, అహాన్ పాండే అనే కొత్త నటీనటులు జంటగా నటించిన 'సయ్యారా' (Saiyaara) ఈ జాబితాలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. జులై 18న విడుదలైన ఈ చిత్రం బాక్సా...