భారతదేశం, డిసెంబర్ 4 -- గూగుల్ 'ఇయర్ ఇన్ సెర్చ్ 2025' రిపోర్టు వచ్చేసింది. ఇది కేవలం సినిమాల జాబితా మాత్రమే కాదు మారుతున్న ఇండియన్ ఆడియెన్స్ అభిరుచులకు అద్దం పడుతోంది. వీటిలో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినిమాలు చోటు దక్కించుకున్నాయి. టాప్ 10లో ఉన్న మూవీస్ ఏవో చూడండి.

యాక్షన్ థ్రిల్లర్ల హోరులో బాలీవుడ్ రొమాన్స్ కొన్నాళ్లుగా మరుగున పడింది. ప్రేక్షకులు కోరుకుంటున్న ఆ లోటును 'సయ్యారా' తీర్చింది. అందుకే ఇది చార్టుల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులోని 'సయ్యారా' పాట, అద్భుతమైన సౌండ్‌ట్రాక్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. ఈ లిరిక్స్, వీడియోల కోసం జనం గూగుల్‌లో విపరీతంగా వెతికారు. కొత్త జంట అనీత్ పడ్డా, అహాన్ పాండేలను సినిమా రిలీజ్ వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనే యష్ రాజ్ ఫిల్మ్స్ వినూత్న వ్యూహం ఫలించింది. వారి గురించి తెలుసుకోవాలనే ...