భారతదేశం, నవంబర్ 13 -- ప్రతి సంవత్సరం నెలకు రెండు ఏకాదశులు చొప్పున 24 ఏకాదశులు వస్తాయి. ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఆ రోజు ఏం చేయాలి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది కూడా 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి నెలా శుక్ల పక్షంలో ఒకటి, మరొకటి కృష్ణపక్షంలో మొత్తం 12 నెలల్లో 24 ఏకాదశులు వస్తాయి. అయితే కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి ఎప్పుడు వచ్చింది, దీని ప్రాముఖ్యత ఏంటి, ఆ రోజున ఏం చేయాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి నవంబర్ 15న వచ్చింది. ఏకాదశి తిథి నవంబర్ 14 రాత్రి 12:49కి ప్రారంభమై, నవంబర్ 15 తెల్లవారుజామున 2:37కి ముగుస్తుంది.ఈ లెక్కన నవంబర్ 15న జరుపుకోవాలి. ఏకాదశి రోజున విష్ణువుని ఆరాధించాలి. పురాణాలలో ఏకాదశి...