భారతదేశం, డిసెంబర్ 25 -- స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు 2025 సంవత్సరం తనకు ఎంతో స్పెషల్ అని చెబుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. సొంత నిర్మాణ సంస్థ 'ట్రాలాలా' నుంచి మొదటి సినిమా 'శుభం' రిలీజ్ చేయడం, అన్నింటికంటే ముఖ్యంగా ఫిలిం మేకర్ రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకోవడంతో ఈ ఏడాది తనకు మర్చిపోలేనిదిగా మిగిలిపోయిందని సామ్ తెలిపింది. ఈ సందర్భంగా ఒక అన్ సీన్ వెడ్డింగ్ ఫోటోను షేర్ చేసింది.

2025 ముగింపు దశకు రావడంతో సమంత ఈ ఏడాది జ్ఞాపకాలను క్రిస్మస్ రోజున ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. గురువారం (డిసెంబర్ 25) ఆమె చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో సమంత షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

వీటిలో తన భర్త రాజ్ నిడిమోరుతో పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫోటో హైలైట్. అందులో రాజ్ ఫన్నీగా ముఖం పెడితే , పక్కనే ఉన్న సమంత నవ్వుతూ కనిపి...