భారతదేశం, నవంబర్ 18 -- చాలా మంది ట్రావెలర్స్​ ప్రయాణ ఖర్చులను తగ్గించుకునేందుకు మార్గాలను అన్వేషిస్తుంటారు. ఇప్పుడు ఆర్టిఫీషియెల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ) రాకతో ఇది మరింత సులభతరంగా మారింది. విమాన టికెట్ ధరలు, రూట్స్​, బ్యాగేజ్​, లాయల్టీ పాయింట్స్​ నుంచి బడ్జెట్​ ఫ్రెండ్లీ లోకల్​ రికమెండేషన్స్​ వరకు.. ఏఐ ఇప్పుడు చాలా విధాలుగా మీ ట్రిప్​ ప్లానింగ్​కి దోహదపడుతుంది.

చాట్​జీపీటీ, గూగుల్​ జెమినీ వంటి ఏఐ అసిస్టెంట్స్​ ఫ్లైట్​ ట్రెండ్స్​, రూట్స్​, ఎయిర్​లైన్​ రూల్స్​ని క్షణాల్లో ఎనలైజ్​ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాయి. గంటలు గంటల వెతికే బదులు.. కొన్ని ప్రత్యేకమైన ప్రాంప్ట్​లు వాడి, క్షణాల్లోనే మీరు మీ ట్రిప్​ని ప్లాన్​ చేసుకోవచ్చు, చాలా వరకు డబ్బులు ఆదా చేసుకోవచ్చు!

విమాన టికెట్​ ధరలు వేగంగా మారిపోతుంటాయి. ఫ్లెక్సిబుల్​ ట్రావెలింగ్​ ప్లాన్స్​ ఉన్న ...