భారతదేశం, ఫిబ్రవరి 26 -- ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ తన కస్టమర్లకు ఫిబ్రవరి 2025లో బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు ఫిబ్రవరి 2025లో ఎంజి కామెట్ కొనాలని ఆలోచిస్తుంటే మీ కోసం గుడ్‌న్యూస్. ఎందుకంటే కంపెనీ ప్రస్తుతం కామెట్ ఈవీపై బంపర్ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ఎంజీ కామెట్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు ఈ ఈవీని ఇంటికి తీసుకెళ్లడం ద్వారా రూ.40,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ డిస్కౌంట్ ఆఫర్లో కార్పొరేట్ డిస్కౌంట్లు, లాయల్టీ బోనస్‌లు, క్యాష్ డిస్కౌంట్లు ఉన్నాయి. దాని వివరాలు వివరంగా తెలుసుకుందాం.

ఇండియన్ మార్కెట్లో ఎంజీ కామెట్ బేస్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్(ఎగ్జిక్యూటివ్) ధర రూ .6,99,800(ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. 2024 మోడల్ మీద ఫిబ్రవరి 2025లో డిస్కౌంట్ తర్వాత రూ .6.59 లక్షలకు లభిస్తుంది. ఎందుకంటే కంపెనీ ఈ ఈవీ పాత స్టాక్‌పై ర...