భారతదేశం, ఏప్రిల్ 22 -- ఎలక్ట్రిక్ కార్లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతుండటంతో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం వివిధ దేశాల కంపెనీల కార్లు సైతం భారత మార్కెట్లో దుమ్ములేపుతున్నాయి. అందులో ఒకటి చైనాకు చెందిన బీవైడీ. BYD తన సీలియన్ 7 కారును భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో ప్రదర్శించింది. తరువాత ఈ సంవత్సరం ఫిబ్రవరిలో భారతదేశంలో రూ. 48.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు విడుదల చేసింది.

ఈ ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ ఇటీవల యూరో NCAP ద్వారా క్రాష్ టెస్ట్ చేశారు. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. వయోజన ప్రయాణీకుల భద్రతలో 87 శాతం, పిల్లల ప్రయాణికుల భద్రతలో 93 శాతం స్కోర్ చేయడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచింది.

బీవైడీ కారు ఆకట్టుకునే భద్రతా లక్షణాలను కలిగి ఉంది. అనేక ఇతర కార్ల మాదిరిగా కాకుండా ఈ కారులో 11 ఎయిర్‌బ్యాగ్‌లు అమర్చబడి ఉన్నాయి. బీవైడీ సీలియన్...