భారతదేశం, సెప్టెంబర్ 12 -- ఎలక్ట్రిక్ వాహన స్టార్టప్ ఓబెన్ ఎలక్ట్రిక్.. పండుగ సీజన్‌ను పురస్కరించుకుని తన 'మెగా ఫెస్టివ్ ఉత్సవ్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రత్యేక ఆఫర్ ద్వారా, వినియోగదారులు తమ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ బైక్‌ లైనప్​​ రోర్ ఈజెడ్​ సిగ్మా, రోర్ ఈజెడ్​ కొనుగోలుపై ఆకర్షణీయమైన ప్రయోజనాలను పొందవచ్చు. పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులకు ఈ-బైక్‌లను మరింత అందుబాటులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం!

ఈ పండుగ ఆఫర్‌లో భాగంగా.. కస్టమర్లు రూ. 35,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో:

రూ. 20,000 ధర ప్రయోజనం (ఇది ఇప్పటికే బైక్‌ల ధరలలో కలిపి ఉంది)

రూ. 10,000 వరకు క్యాష్‌బ్యాక్

ప్రతి కొనుగోలుపై బంగారు నాణెం

అంతేకాకుండా.. ఓబెన్ ఎలక్ట్రిక్ ఒక అదృష్టవంతుడైన కస్టమర్‌కు ఐఫోన్ గెలుచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది.

ఓబెన్ ఎలక్ట...