భారతదేశం, జూన్ 4 -- సాధారణంగా సంతానలేమి సమస్యలు అంటే హార్మోన్ల సమస్యలు, పీరియడ్స్ సరిగా రాకపోవడం లేదా వీర్యం నాణ్యత తగ్గడం వంటివి గుర్తుకొస్తాయి. కానీ రక్తపోటు (హైపర్‌టెన్షన్) కూడా ఒక కారణమని చాలా మంది గుర్తించరు. సహజంగా గర్భం దాల్చడానికి ఇబ్బందులు పడటం నుంచి IVF విజయవంతం కాకపోవడం, గర్భధారణ సమయంలో సమస్యలు రావడం వరకు.. రక్తపోటు సంతానలేమిలో తక్కువ అంచనా వేసే ఒక కారణం.

"హైబీపీ కేవలం గుండెను మాత్రమే కాదు. ఇది సంతానోత్పత్తి, IVF విజయవంతం కావడం, చివరికి గర్భధారణ ఆరోగ్యంపై కూడా పెద్ద ప్రభావం చూపుతుంది" అని ప్రిస్టిన్ కేర్ ఫెర్టిసిటీలో రీప్రొడక్టివ్ మెడిసిన్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఇల గుప్తా హిందుస్తాన్ టైమ్స్ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

మీరు ఆరోగ్యంగా, యంగ్‌గా, యాక్టివ్‌గా ఉన్నారని అనిపించవచ్చు. కానీ మీ రక్తపోటు ...