Hyderabad, మార్చి 13 -- జీవితంలో మంచి స్నేహితుడు దొరికితే ఎన్నో ఒడిదొడుకలను తేలికగా దాటవచ్చు. మీ సంతోషాన్ని రెట్టింపు చేసేది స్నేహితులే. మీ విచారాన్ని పోగొట్టేది, మీకు భుజం తట్టేది కూడా నిజమైన స్నేహితులే. అలాగే బంధువులు కూడా కష్టసుఖాల్లో తోడుంటారు. అయితే కొంత మంది మాత్రం రెండు ముఖాలు ఉన్న వ్యక్తులు ఉంటారు. వారు మీతో ఒక పక్క స్నేహం చేస్తూనే మరోపక్క మీ పట్ల అసూయను పగను పెట్టుకుంటారు. ఆచార్య చాణక్యుడు జీవితంలో కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉండమని చెప్పాడు. కొందరితో స్నేహం చేయడం విషం తాగడంతో సమానమని వివరించాడు. మీ చుట్టూ కొన్ని రకాల అలవాట్లు ఉన్న వ్యక్తులు ఉంటే వారికి మైళ్ళ దూరంలో ఉండాల్సిన అవసరం ఉంది.

కొంతమంది వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుందంటే వారు మీ ముందు మిమ్మల్ని పొగుడుతారు. మీకంటే ఎవరూ బాగా ఆలోచించలేరని అంటారు. మీ వెనుక మాత్రం ద్వేషాన్ని కక్...