Hyderabad, ఫిబ్రవరి 15 -- ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు అందరూ అధికంగా తినేది అన్నం. లంచ్ నుంచి డిన్నర్ వరకు అన్నం మాత్రమే తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అన్నంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి అన్నంలో కలుపుకుని తినే ఆహారాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. అన్నం పెద్ద మొత్తంలో తినడం అంత మంచిది కాదు. అన్నాన్ని మితంగా సమతుల్య ఆహారంగా తీసుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బియ్యం మంచి శక్తి వనరు. అనేక సూక్ష్మ పోషకాలకు మూలం. ఇది పరిమిత పరిమాణంలో సరైన ఆహారాలతో కలిపి తింటే మంచి భోజనం అవుతుంది. అయితే కొన్ని పదార్థాలను అన్నంతో కలిపి తినకుండా ఆపాలి. లేకపోతే అనేక రకాల అనారోగ్యాలు వస్తాయి.

కొంతమంది అన్నం తిన్నాక రోటీ కూడా తింటారు. రోటీ తిన్నాక అన్నం తింటూ ఉంటారు. అన్నం, రోటీ కలిపి ఎప్పుడూ తినకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వాస్తవానికి, రె...