Hyderabad, జూన్ 13 -- టాలీవుడ్ నిర్మాత బన్నీ వాస్ నూతన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మిత్ర మండలి'. అభిరుచి గల నిర్మాతలు కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మిత్ర మండలి సినిమాలో ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషించారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించారు. తాజాగా 'మిత్ర మండలి' టీజర్‌ను నిర్మాతలు విడుదల చేశారు.

మిత్ర మండలి టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం నిన్న గురువారం (జూన్ 12) ఉదయం హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మిత్ర మండలి టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ విశేషా...