భారతదేశం, ఆగస్టు 4 -- భారత తపాలా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది! 50 ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్న ప్రతిష్టాత్మక రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కార్యకలాపాలను ఆధునీకరించే లక్ష్యంతో స్పీడ్ పోస్ట్​తో వ్యూహాత్మక విలీనంలో భాగంగా సెప్టెంబర్ 1, 2025 నుంచి ఈ సేవ దశలవారీగా నిలిచిపోనుంది. విశ్వసనీయత, సరసమైన ధరలు, చట్టపరమైన చెల్లుబాటుకు పేరుగాంచిన రిజిస్టర్డ్ పోస్ట్.. ఉద్యోగ ఆఫర్లు, లీగల్ నోటీసులు వంటి ముఖ్యమైన పత్రాలను పంపిణీ చేయడంతో లక్షలాది మంది భారతీయుల జీవితాల్లో కీలక పాత్ర పోషించింది.

ఇండియా పోస్ట్​ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం.. ఈ తరహా సర్వీస్​ వినియోగం తగ్గడమే. అధికారిక గణాంకాల ప్రకారం.. 2011-12లో 244.4 మిలియన్లుగా ఉన్న రిజిస్టర్డ్ ఐటెమ్‌ల సంఖ్య 2019-20 నాటికి 184.6 మిలియన్లకు 25% తగ్గింది. డిజిటల్ వినియోగం ...