Hyderabad, అక్టోబర్ 10 -- ఆహా వీడియో ఓటీటీ మరో అదిరిపోయే తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ను అందించబోతోంది. ఈ సిరీస్ పేరు ఆనందలహరి (Anandalahari). ఆనంద్, లహరి అనే ఓ యువ జంట చుట్టూ తిరిగే కథతో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను శుక్రవారం (అక్టోబర్ 10) మేకర్స్ రిలీజ్ చేశారు.

ఓటీటీలోకి మరో కొత్త తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్ పేరు ఆనందలహరి. ఆహా వీడియో ఓటీటీలో అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. పాన్ గోదావరి అంటూ ఈస్ట్ అబ్బాయి, వెస్ట్ అమ్మాయి మధ్య జరిగే ప్రేమ, పెళ్లి కాన్సెప్ట్ తో ఈ సిరీస్ రూపొందించారు. 3 నిమిషాలకుపైగా ఉన్న ట్రైలర్ చాలా సరదాగా సాగిపోయింది. ట్రైలర్ మొదట్లోనే ఈ వెబ్ సిరీస్ లో లీడ్ రోల్స్ అయిన ఆనంద్, లహరి ఓ కౌన్సిలర్ ను కలవడం చూపించారు.

తమ మధ్య బంధంలో సమస్యతో ...