భారతదేశం, మే 10 -- వాతావరణ శాఖ నుంచి పెద్ద అప్డేట్ వచ్చింది. రుతుపవనాలు నిర్ణీత సమయం కంటే ముందే కేరళ తీరాన్ని చేరుకోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 27న రుతుపవనాలు రానున్నాయి. సాధారణంగా జూన్ 1 తర్వాత రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి.

సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నాటికి కేరళలో ప్రవేశించి జూలై 8 నాటికి దేశం మొత్తాన్ని కవర్ చేస్తాయి. ఇది సెప్టెంబర్ 17న వాయువ్య భారతదేశం నుండి వెనక్కి తగ్గడం ప్రారంభిస్తుంది. అక్టోబర్ 15 నాటికి పూర్తిగా తిరిగి వెళుతుంది. 2025 రుతుపవనాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది.

నాలుగు నెలల రుతుపవనాల్లో (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు) భారత్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ తెలిపారు. ఈసారి ప్రీ మాన్ సూన...