భారతదేశం, జనవరి 11 -- జర్న‌లిజం గౌర‌వాన్ని నిల‌బెట్టి ఆ వృత్తికి వ‌న్నెతెచ్చే జ‌ర్న‌లిస్టులంద‌రికీ రాష్ట్ర ప్ర‌భుత్వం అన్నివిధాలా అండ‌దండ‌గా ఉంటుంద‌ని రాష్ట్ర స‌మాచార‌, పౌర‌సంబంధాల‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ఏ ఒక్క‌రి గౌర‌వాన్ని త‌గ్గించాల‌ని గాని, చిన్న‌బుచ్చాల‌ని గాని త‌మ‌ ప్ర‌భుత్వ ఉద్దేశ్యం కాద‌ని స్ప‌ష్టం చేశారు.

జీవో 252 పై శ‌నివారం నాడు స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో 14 జ‌ర్న‌లిస్టు సంఘాల ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ. స‌మావేశంలో జ‌ర్న‌లిస్టు సంఘాల ప్ర‌తినిధులు విలువైన సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చార‌ని వారు ప్ర‌స్తావించిన అంశాల‌ను విజ్ఞ‌ప్తుల‌ను ప‌రిశీలించి సానుకూల‌మైన నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. జీవో 252లో మార్పులు చేర్పులు చేస్తామ‌ని హామీ ఇచ్చా...