భారతదేశం, జనవరి 2 -- భారత ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే 'విన్‌ఫాస్ట్' అనూహ్య ఫలితాలను సాధిస్తోంది! 2025 డిసెంబర్ నెలకు సంబంధించి విడుదలైన విక్రయాల గణాంకాల ప్రకారం.. పరిమిత మోడళ్లతోనే బరిలోకి దిగిన వియత్నాంకు చెందిన ఈ సంస్థ, ఇండియాలో హ్యుందాయ్, కియా వంటి దిగ్గజ కంపెనీలను వెనక్కి నెట్టి నాలుగో అతిపెద్ద ఈవీ బ్రాండ్‌గా అవతరించింది.

వాహన్ పోర్టల్‌లోని తాజా గణాంకాల ప్రకారం.. 6,434 యూనిట్ల విక్రయాలతో (2025 డిసెంబర్​) టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మార్కెట్లో రారాజుగా కొనసాగుతోంది. రెండో స్థానంలో 3,555 యూనిట్లతో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా నిలువగా, 3,065 యూనిట్ల అమ్మకాలతో మహీంద్రా ఎలక్ట్రిక్ మూడో స్థానాన్ని దక్కించుకుంది.

ఇక అందరినీ ఆశ్చర్యపరుస్తూ 375 యూనిట్లు విక్రయించిన విన్‌ఫాస్ట్ ఆటో ఇండియా ...