Hyderabad, సెప్టెంబర్ 8 -- తెలుగులో ఈ వారం ఇటు ఓటీటీ, అటు థియేటర్లలోకి చాలా సినిమాలు, వెబ్ సిరీసే ఉన్నాయి. అయితే వీటిలో ఓటీటీల్లోకి అడుగుపెట్టబోతున్న ఐదు మూవీస్, సిరీస్ ఆసక్తి రేపుతున్నాయి. ఈ లిస్టులో డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏవి? ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ మూవీ ఈ వారమే ఓటీటీలోకి వస్తోంది. గురువారం (సెప్టెంబర్ 11) నుంచే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతోంది. బాక్సాఫీస్ దగ్గర రూ.500 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు ఓటీటీలో మరింత మంచి రెస్పాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు.

బ్లాక్‌బస్టర్ కన్నడ హారర్ కామెడీ మూవీ సూ ఫ్రమ్ సో ఈవారం ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ మధ్యే జియోహాట్‌స్టార్ ఈ విషయం అనౌన్స్ చేసింది. మంగళవారం (సెప్టెంబర్ 9) నుంచే ఈ సినిమా...