భారతదేశం, నవంబర్ 17 -- ఓటీటీలోకి ఈవారం అంటే నవంబర్ 17 నుంచి 23 మధ్య స్ట్రీమింగ్ రాబోతున్న వివిధ సినిమాలు, వెబ్ సిరీస్ వివరాలు ఇక్కడ చూడండి. వీటిలో జాన్వీ కపూర్ నటించిన హోమ్‌బౌండ్, ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సీజన్ 3, బెంగాల్ ఫైల్స్ మూవీలాంటివి ఉన్నాయి. మరి అవేంటో చూడండి.

జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ లీడ్ రోల్స్ లో నటించిన మూవీ ఇది. నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతమై, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రశంసలు పొందింది. ఇది ఇద్దరు స్నేహితులు పోలీస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యేందుకు పడే కష్టం చుట్టూ తిరుగుతుంది. నవంబర్ 21న నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది.

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 'డైరెక్ట్ యాక్షన్ డే', 'నౌఖాలీ అల్లర్లు' వంటి చారిత్రక సంఘటనల నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాకు థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ ర...