భారతదేశం, డిసెంబర్ 1 -- ఓటీటీలోకి ఈవారం వస్తున్న మలయాళం సినిమాల్లో ఓ హారర్ థ్రిల్లర్ ఎంతో ఆసక్తి రేపుతోంది. అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర రూ.82 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా పేరు డైస్ ఇరే (Dies Irae). మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్ లీడ్ రోల్లో నటించాడు. ఈ సినిమా జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ ఏడాది ఎన్నో బ్లాక్‌బస్టర్ మలయాళం మూవీస్ వచ్చాయి. అందులో ఒకటి ఈ హారర్ థ్రిల్లర్ మూవీ డైస్ ఇరే. ఈ సినిమాను ఈ శుక్రవారం అంటే డిసెంబర్ 5 నుంచి జియోహాట్‌స్టార్ స్ట్రీమింగ్ చేయనుంది. మలయాళంతో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు ఐఎండీబీలో 7.3 రేటింగ్ నమోదైంది. ఇప్పుడు ఐదు భాషల్లో డిజిటల్ ప్రీమియర్ కానుండటంతో ఓటీటీలో మరింత ఆదరణ లభించే అవకాశం ఉంది.

ఆత్మ, ప్రతీకారం అనే అంశాల చూట్టూ సాగే...